Actress Samantha Chit Chat With Her Fans On Twitter, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: జీవితం అంతకు ముందులా లేదు, విభిన్నంగా ఉంది: సమంత

Jan 2 2023 4:52 PM | Updated on Jan 2 2023 7:28 PM

Actress Samantha Chit Chat With Fans on Twitter - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజు క్రితం ఈ వ్యాధి బారిన ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతుంది. దీంతో షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇచ్చి ఆమె ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్విటర్‌ వేధిగా ఆమె ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ అభిమాని ‘మేడమ్‌ మీ జీవితం ఎలా సాగుతోంది’ అని అడగ్గా.. విభిన్నంగా ఉంది అంటూ సమాధానం ఇచ్చింది.

చదవండి: అజిత్‌ కూతురు అనౌష్కను చూశారా? ఎంత అందంగా తయారైందో!

ఇక మరో ఫ్యాన్‌ ‘మేడమ్‌ మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతిరోజూ కోరుకుంటున్నాను. మళ్లీ మీరు బాక్సాఫీస్‌ సక్సెస్‌లు అందుకోవాలి. అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి’ అని అన్నాడు. దీనికి సామ్‌ స్పందిస్తూ... ‘‘మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు’’ అంటూ ఫన్నిగా బదులిచ్చింది. ‘మీరు శాకుంతలం ప్రాజెక్ట్ అంగీకరించడానికి కారణం?’ అని వేరొక నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘త్వరలో మీకే తెలుస్తుంది’ అని చెప్పింది.

చదవండి: వాల్తేరు వీరయ్య టైటిల్‌ సాంగ్‌ లిరిక్స్‌ వివాదం.. యండమూరికి చంద్రబోస్‌ గట్టి కౌంటర్‌

అనంతరం తను కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలిపింది. కాగా రీసెంట్‌గా సమంత నటించిన శాకుంతలం మూవీ విడుదలకు రేడీ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ మూవీని ఫిబ్రవరి 17న రిలీజ్‌ చేయబోతున్నట్లు నేడు చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్‌ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో సమంత లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement