విజయ్ గెలుపు.. బుట్టబొమ్మకు ముందే తెలుసా? | Actress Pooja Hegde Guessed vijay win In Tamilanadu elections | Sakshi
Sakshi News home page

Pooja Hegde: విజయ్ విన్.. బుట్టబొమ్మ ముందే చెప్పేసిందిగా..!

May 5 2026 7:51 PM | Updated on May 5 2026 8:53 PM

Actress Pooja Hegde Guessed vijay win In Tamilanadu elections

తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది.  ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌  ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్‌ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్‌ టైమ్‌లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్‌ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement