Actor Vijay Devarakonda To Enter Multiplex Business - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: మ‌ల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్న విజయ్‌

Sep 20 2021 9:54 AM | Updated on Sep 20 2021 2:25 PM

Actor Vijay Devarakonda Enters Into Multiplex Business - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్‌ చేస్తున్న రౌడీ హీరో, అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి మ‌ల్టీప్లెక్స్ సినిమా ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు.

ఏవీడీ (ఆసియన్‌ విజయ్‌ దేవరకొండ) సినిమాస్‌ పేరుతో ఆ మ‌ల్టీప్లెక్స్‌ను సెప్టెంబర్‌ 24న ప్రారంభించనున్నట్లు ఈ కుర్ర హీరో తెలిపాడు. నటుడిగా రాణించాలనే కల నుంచి సొంతంగా మ‌ల్టీప్లెక్స్‌ సినిమాను నిర్మించే వరకు రావడం ఆనందంగా ఉందని చెప్పాడు.  కాగా, విజయ్‌ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైగ‌ర్’ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్‌, కరణ్ జోహార్‌ నిర్మిస్తున్న ఈ మూవీని పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

చదవండి: బన్నీ రికార్డు బ్రేక్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement