క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్ | 12th Fail Actor Vikrant Massey Apology For Old Tweet Featuring Ram-Sita - Sakshi
Sakshi News home page

Vikrant Massey: పాత ట్వీట్‌కు సారీ చెప్పిన యంగ్ హీరో!

Published Wed, Feb 21 2024 10:17 AM

12th Fail Actor Vikrant Massey Apology Old Tweet Featuring Ram Sita - Sakshi

'12th ఫెయిల్' హీరో క్షమాపణ చెప్పాడు. అప్పుడెప్పుడో ఐదారేళ్ల క్రితం చేసిన ట్వీట్‌ని డిలీట్ చేయడంతో పాటు అప్పుడు జరిగిన విషయమై అసలేం జరిగిందో వివరణ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్.. అర్థరాత్రి చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు సారీ చెప్పాడు?

హిందీ సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సే.. ఆ తర్వాత బుల్లితెర నుంచి సినిమా స్క్రీన్‌కి షిఫ్ట్ అయ్యాడు. కాకపోతే సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అదే టైంలో ఓటీటీలో 'మీర్జాపుర్' లాంటి వెబ్ సిరీస్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. గతేడాది చివర్లో '12th ఫెయిల్' మూవీతో బ్లాక్‪‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)

అయితే విక్రాంత్ 2018లో చేసిన ఓ ట్వీట్‌ని నెటిజన్లు బయటకు తీశారు. రాముడు-సీత కార్టున్‌తో ఉన్న ఈ ట్వీట్.. హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కొందరు విమర్శలు చేశారు. దీంతో సదరు ట్వీట్‌ని డిలీట్ చేసిన ఈ హీరో.. దీనికి ప్రతిగా క్షమాపణలు కూడా చెప్పాడు.

'2018లో నేను కొన్ని ట్వీట్ చేశా. ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామనుకుంటున్నాను. హిందు కులాన్ని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. కానీ నేను చేసిన ట్వీట్ అలా అర్థం వచ్చేలా ఉండటం నాకు బాధ కలిగించింది. పేపర్‌లో వచ్చిన కార్టూన్‌నే నేను పోస్ట్ చేశాను. కానీ ఎవరైతే ఈ ట్వీట్ వల్ల బాధపడ్డారో వాళ్లందరికీ నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. అందరూ తప్పులు చేస్తాను. ఇప్పుడు నేను చేశాను' అని విక్రాంత్ మస్సే తన ట్విట్టర్ (ఎక్స్)లో రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?)

Advertisement
 
Advertisement