దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిది
దుబ్బాక: రాష్ట్రంలో అధికారంలో లేకున్నా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి గెలిపించిన దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం నూతనంగా ఎన్నికై న చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత, వైస్ చైర్‌పర్సన్ ఆస సులోచన, కౌన్సిలర్లను అభినందించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా కుటిల ప్రయత్నాలు చేసినా 14 మంది కౌన్సిలర్లను గెలిపించి బీఆర్‌ఎస్‌కు అండగా నిలవడం సంతోషకరమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నూతనంగా ఎన్నికై న మున్సిపల్ పాలకమండలితో కలిసి దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


