పార్టీలకు అతీతంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పార్టీలకు అతీతంగా అభివృద్ధి

Feb 17 2026 8:48 AM | Updated on Feb 17 2026 8:48 AM

పార్ట

పార్టీలకు అతీతంగా అభివృద్ధి

నేడు జాబ్‌ మేళా

చైర్‌పర్సన్‌ లక్ష్మీయాదవ్‌,

వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌

నర్సాపూర్‌: నర్సాపూర్‌ పట్టణాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని సోమవారం ఎన్నికై న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వి.బుచ్చెష్‌యాదవ్‌లు చెప్పారు. వారిద్దరు ప్రమాణస్వీకారం అనంతరం విలేకరులతో మాట్లాడారు. గెలిపించిన ఓటర్లు, తమకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని అన్ని పార్టీల కౌన్సిలర్లతో కలిసి ముందుకు సాగుతామని, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వారి వెంట కౌన్సిలర్లు ఉన్నారు.

బస్టాండ్‌ తనిఖీ

నర్సాపూర్‌: నర్సాపూర్‌ బస్టాండ్‌ను సోమవారం ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ తనిఖీ చేశారు. ఏడుపాయల ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఏర్పాట్లను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డిపో ఇన్‌చార్జి లక్ష్మన్‌, కంట్రోలర్‌ వెంకట్‌గౌడ్‌ బస్టాండ్‌లో చేపట్టిన వసతులు వివరించారు.

అభివృద్ధే ముఖ్యం

మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పాలకవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంతక ముందు గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను గెలిపించారన్నారు. హుస్నాబాద్‌ చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల కేంద్రాల మాదిరి మరింత ప్రగతి బాట పట్టిస్తామన్నారు. హుస్నాబాద్‌లో మౌలిక సదుపాయాలు, వారి స్థితిగతులు మెరుగుపరుస్తామన్నారు. హుస్నాబాద్‌ అభివృద్ధిలో ఒక మోడల్‌గా రూపొందిస్తామన్నారు. శాసనసభ్యుడిగా పాలకవర్గానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, కమిషనర్‌ మల్లికార్జున్‌, కౌన్సిలర్లు ఉన్నారు.

నంగునూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెటీరో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ శివకోటి తెలిపారు. టెన్త్‌లో 60 శాతం, ఇంటర్మీడియెట్‌లో 55 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే మేళాకు ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్‌టీ, ఫార్మా, బ్రిడ్జ్‌ కోర్స్‌ చేసిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. టెన్త్‌, ఇంటర్‌ మెమోలు, ఒరిజినల్‌ ఆధార్‌కార్డు తోపాటు రెండు జిరాక్స్‌ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్ల శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించి నెలకు రూ.12,500 చెల్లిస్తారని చెప్పారు.

పార్టీలకు అతీతంగా అభివృద్ధి
1
1/1

పార్టీలకు అతీతంగా అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement