ప్రజలంతా బీఆర్‌ఎస్ వైపే..
జిన్నారం (పటాన్‌చెరు): పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన గుమ్మడిదల మండల సర్పంచులను మాజీమంత్రి హరీశ్‌రావు అభినందించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల పరిధిలోని నాలుగు గ్రామపంచాయతీలో విజయం సాధించిన బీఆర్‌ఎస్ సర్పంచులు, వార్డు సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. మండలంలో ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో నాలుగు పంచాయతీలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ బలోపేతంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని నూతన సర్పంచులకు సూచించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు
నూతన సర్పంచులకు అభినందనలు


