నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్
ఉదయం 7గంటల నుంచి ప్రారంభం ● కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది 161 సర్పంచ్, 1,221 వార్డులకు ఎన్నికలు ● గట్టి బందోబస్తు: ఎస్పీ
మెదక్‌జోన్: ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మూడో విడతలో నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, చిలిప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దూర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో 183 గ్రామ పంచాయతీలు, 1,,528 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇప్పటికే 22 సర్పంచ్, 307 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 161 పంచాయతీలతో పాటు 1,221 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా 41 సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు.
సామగ్రితో తరలిన సిబ్బంది
నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్
నేడు పల్లెపోరు తుది విడత పోలింగ్


