పదేళ్లు కాంగ్రెస్‌కు ధోకా లేదు
మునిపల్లి(అందోల్): ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను గోపులారం సర్పంచ్ బుడ్డ మల్లేశం, ఉపసర్పంచ్ బుర్కల లలిత, వార్డు సభ్యులు కలిశారు. మంగళవారం మండలంలోని పెద్దగోపులారం మాజీ ఎంపీటీసీ పాండు ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో సమావేశమైన వీరు.. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకులంగా స్పందించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత నూతన సర్పంచులపై ఉంటుందన్నారు.
సంగారెడ్డి: నూతనంగా ఎంపికై న సర్పంచ్‌లు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. పుల్కల్, చౌటకూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో గెలుపొందిన సర్పంచ్‌లు సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చౌటకూర్ మండలంలో 15 పంచాయతీలకు 13 సర్పంచ్ స్థానాలు, పుల్కల్ మండలంలో 19 పంచాయతీలకు 12 సర్పంచ్ పదవులను కాంగ్రెస్ మద్దతుదారులు కై వసం చేసుకోవడం పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ గ్రామానికి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యత సర్పంచులదేనని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీపీ మాజీ అధ్యక్షుడు భూంరెడ్డి సుభాష్ రెడ్డి ,మల్లికార్జున్ కొల్కూరి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
వట్‌పల్లి(అందోల్): అందోల్, వట్‌పల్లి మండలాల్లోని కన్‌సాన్‌పల్లి, రాంసాన్‌పల్లి, ఉసిరికపల్లి తదితర గ్రామాలలో గెలుపొందిన నూతన సర్పంచ్‌లు మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధోకా లేదన్నారు. నూతన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శేరి వెంకట్‌రెడ్డి, అందోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ బాలయ్య, నాయకులు మహిపాల్, కృష్ణ, సురేష్‌రావు, రమేశ్‌గౌడ్, వీరేశం, జాను, నర్సింలు, నాగార్జున్‌రెడ్డి, బాల్‌రాజ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఎంటీసీసీ, జెడ్పీటీలను మీరే గెలిపించాలి
ప్రజాకాంక్ష మేరకు పనిచేయాలి
ప్రభుత్వానికి ప్రజా మద్దతు: దామోదర
నూతన సర్పంచ్‌లకు అభినందన