ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
కొల్చారం(నర్సాపూర్): మూడో విడత ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ వెంట డీఈఓ విజయ, రాజిరెడ్డి, ఎంపీడీఓ రఫీకున్నిసా, తహసీల్దార్ శ్రీనివాస్ చారి ఉన్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: జెడ్పీ సీఈఓ
వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో మూడో విడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఎన్నికల సిబ్బందికి సూచించారు. పోలింగ్ సామగ్రి, ఎన్నికల సిబ్బంది కేటాయింపు, తరలింపు ప్రక్రియను మాసాయిపేట మండల కేంద్రంలో సీఈఓ ఎల్లయ్య, వెల్దుర్తి మండల కేంద్రంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. విధుల పట్ల అలక్ష్యం చేయవద్దని సూచించారు.


