ప్రతిభ ఉన్నా.. ప్రోత్సాహం సున్నా
జాతీయస్థాయికి ఎగ్జిబిట్
18 నుంచి భోపాల్‌లో..
మెదక్ మున్సిపాలిటీ: ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణలు రూపొందించాలని అధికారులు పదే పదే చెబుతుంటారు. కానీ ఆస్థాయిలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించడంలో విఫలమవుతున్నారు. పాపన్నపేట మండలం లింగాయిపల్లి చీకోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివచైతన్య, గైడ్ టీచర్ కిషన్‌ప్రసాద్ సహకారంతో ‘విపత్తుల నిర్వహణ ఆధునిక జేసీబీ, అగ్నిమాపక, వ్యవసాయ బహుముఖ వాహనం’ రూపొందించాడు. గతేడాది మెదక్‌లో జరిగిన జిల్లాస్థాయి గణిత వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ఎగ్జిబిట్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. అదే సంవత్సరం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో సైతం ప్రథమ బహుమతి పొంది దక్షిణ భారతస్థాయికి ఎంపికై ంది. ఈ ఏడాది జనవరిలో పాండిచ్చేరిలో జరిగిన దక్షిణ భారతస్థాయిలో ఎగ్జిబిట్ జిల్లా కీర్తిని చాటి చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రో త్సాహం అందలేదని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిట్‌లు తయారు చేసేందుకు ఖర్చు లు రూ. వేలల్లో ఉంటున్నాయని, ప్రభుత్వ ప్రో త్సాహం లేకపోవడంతో ప్రతిభ గల విద్యార్థులు త మ నైపుణ్యం ప్రదర్శించే అవకాశం లేకుండా పోతుందని వాపోయాడు.
పోటీకి వెళ్లాలంటే సుమారు రూ. 75 వేలు అవసరం
సహాయం అందించాలని విద్యార్థి వేడుకోలు
ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగే జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు శివచైతన్య రూపొందించిన ఎగ్జిబిట్ ఎంపికై ంది. అక్కడికి వెళ్లాలంటే ఈనెల 16న జిల్లా నుంచి బయల్దేరాలి. కానీ తన వద్ద డబ్బులు లేవని విద్యార్థి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. నాసా, ఇస్రో, డీఆర్డీఓ, గ్లోబల్ సైంటిస్టుల 15 రోజుల సమ్మిట్‌కు వెళ్లడానికి అవకాశం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో వెళ్లలేదని తెలిపాడు. ఇదే విషయం జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా డీఈఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.


