పేదల సొంతింటి కల సాకారం
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు మిర్జాపల్లి తండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికి ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. మెదక్ సొంత జిల్లా అయినప్పటికీ, అప్పటి సీఎం కనీసం పట్టించుకోలేదన్నారు. పేదల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు రుణమాఫీ, గ్రామాల అభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, ఎంపీడీఓ దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ రమణ, మాజీ ఎంపీపీలు అరుణ, శ్రీమన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రాజిరెడ్డి, జనార్దన్, మనోజ్, ప్రభాకర్, మిర్జాపల్లి తండా నాయకులు విఠల్‌నాయక్, మహిపాల్, మోహన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్


