లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
కలెక్టర్ రాహుల్‌రాజ్
రామాయంపేట(మెదక్): కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేశామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 500 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. సన్నరకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేస్తున్నారని, తూకం వేసిన 24,700 మంది రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ. 84.19 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా అన్ని కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని, ఽతూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు పంపిస్తున్నామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు.


