బాల్య వివాహాలను నిర్మూలిద్దాం: డీడబ్ల్యూఓ
కౌడిపల్లి(నర్సాపూర్): బాల్య వివాహాలు జర గని జిల్లాగా మెదక్‌ను మార్చాలని డీడబ్ల్యూఓ హేమాభార్గవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, శారీరక మానసిక ఎదుగుదల లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, ఐకేపీ డ్వాక్రా మహిళలు బాల్య వివాహాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం డీఎల్‌పీఓ సాయిబాబ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం చిన్నారుల బారసాల నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


