బడిలో పాము కలకలం
అల్లాదుర్గం(మెదక్): పాఠశాలలో నాగుపాము కలకలం సృష్టించింది. భయంతో విద్యార్థులు బయటకు పరుగు తీశారు. ఈఘటన శుక్రవారం మండల పరిధిలో గడిపెద్దాపూర్ జెడ్పీ పాఠశాలలో జరిగింది. పదో తరగతి గదిలో పాఠాలు బోధిస్తుండగా పాము రావడంతో ఉపాధ్యాయుడు చూసి అరిచాడు. దీంతో విద్యార్థులు భయంతో బయటకు పరుగు తీశా రు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు పామును చంపి వేయడంతో ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల చుట్టూ పొలాలు ఉండటంతో పాములు సంచరిస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
నారాయణఖేడ్: చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలని ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పేర్కొ న్నారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని సా ంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉంటే నేరాలు చేయడానికి భయం కలిగి నేరాలు తగ్గుతాయన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


