ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి పెంచాలి
హవేళిఘణాపూర్(మెదక్): రైతులకు సుస్థిర ఆదాయానిచ్చే ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తరణ పెంచేలా చూడాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్ర వారం హవేళిఘణాపూర్ రైతువేదికలో జిల్లాలోని సహకార సంఘాల సీఈఓలు, ఏఓలు, ఏఈఓలకు అవగాహన కల్పించారు. జిల్లాకు కేటాయించిన 2,500 ఎకరాల సాగు లక్ష్యం మేరకు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో ఉద్యానవన శాఖ అధికారుల కొరత ఉన్నందున క్లస్టర్ పరిధిలో 30 ఎకరాలు సాగు చేసేలా చూడాలన్నారు. రైతులకు లాభం చేకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు కృషి చేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. రైతులు వరినే కాకుండా ఇతర పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. కార్య క్రమంలో డీఏఓ దేవ్‌కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


