టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
చేగుంట(తూప్రాన్): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని కర్నాల్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న మూడు రోజుల పాటు రైతులు వరి కోతలు చేపట్టకుండా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే అన్‌లోడ్ చేసుకొని ట్యాబ్ ఎంట్రీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శివప్రసాద్, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, సీసీ స్వేత, రైతులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
తూప్రాన్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని రావెల్లి మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు అసౌకర్యాలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం నూతన పీహెచ్‌సీ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్


