ప్రభుత్వ బడులకు అండగా నిలుద్దాం
మనోహరాబాద్(తూప్రాన్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అండగా ఉండటానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మండలంలోని దండుపల్లి శివారులోని ఓ గార్డెన్‌లో రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్‌రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మనోహరాబాద్ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ విద్యార్థులకు రూ. 1.50 లక్షల విలువైన క్రీడా వస్తువులను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలవాల ని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఎంఈఓ మల్లేశ్, నాయకులు వెంకట్‌రెడ్డి, జావీద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి


