ఆయిల్‌పామ్ సాగుకు రాయితీ
నిజాంపేట(మెదక్): ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చల్మెడలో లీవ్‌పామ్ రిసోర్స్, జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ నర్సరీని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. ఇప్పటివరకు 600 ఎకరాల్లో రైతులు సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 4 లక్షల మొక్కలు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 20 వేలు మొక్కలు అందు బాటులో ఉన్నాయని చెప్పారు. వచ్చే సంవత్సరం రైతులు నాటుకోవడానికి మరో 1.5 లక్షల మొక్కలు సిద్ధం చేస్తామన్నారు. జిల్లా రైతులు వరికి బదులు ఆయిల్‌పామ్ పంట సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ ఉప సంచాలకులు వినయ్ విన్సెంట్, రామాయంపేట డివిజన్ ఉప సంచాలకులు రాజ్‌నారాయణ, టెక్నికల్ వ్యవసాయ అధికారులు వందన, నాగమాధురి, నిజాంపేట వ్యవసాయ అధికారి సోమలింగంరెడ్డి, ఉద్యాన అధికారి రచన, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ, ఉద్యాన అధికారులు
దేవ్‌కుమార్, ప్రతాప్‌సింగ్


