వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
రామాయంపేట(మెదక్): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటే సంబంధిత లెక్చరర్లపై చర్యలు తప్పవని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి హెచ్చరించారు. బుధవారం ఆమె స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా అఽ ద్యాపకులు కృషి చేయాలన్నారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు కేటగిరీలుగా విభజించి విద్యాబోధన చేయాలని, ప్రతి సబ్జెక్టుపై విద్యార్థులు పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కళాశాల రికార్డులు పరిశీలించి లెక్చరర్లతో మాట్లాడారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ హిమజ్యోతి, సిబ్బంది ఉన్నారు.
డీఐఈఓ మాధవి


