తూప్రాన్‌లో 2కే రన్
తూప్రాన్: దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డీఎస్పీ నరేందర్‌గౌడ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పట్టణ కేంద్రంలో పోలీసు సబ్ డివిజన్ పరిధిలో మంగళవారం 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జెండా ఊపి రన్ ప్రారంభించారు. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు కట్ట వరకు టూకే రన్ కొనసాగింది. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విజేతలను ప్రకటించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐలు శివానందం, యాదగిరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


