కౌమార దశ కీలకం
● పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ● సఖీ సెంటర్ నిర్వాహకురాలు రేణుక
మెదక్ కలెక్టరేట్: పిల్లల్లో కౌమార దశ చాలా కీలకమని, ఈ వయస్సులో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సఖీ సెంటర్ నిర్వాహకురాలు రేణుక తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌లో ‘నాషా ముక్త్ భారత్ అభియాన్– మాదకద్రవ్య దుర్వినియోగంపై మిషన్ పరివర్తన’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారి హేమభార్గవి, మిషన్ పరివర్తన కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఫిర్దౌస్ నహేదాల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం రేణుక మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వైపు యువత మొగ్గు చూపకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆరోగ్యం, కుటుంబాన్ని, సమాజాన్ని రక్షించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వివిధ వ్యవస్థలు కుటుంబం, పాఠశాల, కమ్యూనిటీ, మీడియాతో నిర్వహించే కార్యక్రమాలు, జ్ఞానాన్ని పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మిషన్ పరివర్తన కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఫిర్దౌస్ నహేదా మాట్లాడుతూ అవసరమైన సహాయం అందించడం ద్వారా మనం డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. అవసరమైన వారు 1098, 100, 14446 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.


