త్వరలో ఎకో పార్కు ప్రారంభం
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● అర్బన్‌పార్కులో కాటేజీల పరిశీలన
నర్సాపూర్: నర్సాపూర్‌లో ఎకో పార్కును త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. మంగళవారం అటవీ శాఖ అధికారులతో కలిసి నర్సాపూర్ అర్బన్‌పార్కులో నిర్మించిన కాటేజీల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎకో పార్కులో ప్రైవేట్ సంస్థ సహకారంతో అటవీ శాఖ 42 కాటేజీలను నిర్మించిందని చెప్పారు. కాగా వాటిని మంత్రి కొండా సురేఖ చేత ప్రారంభించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్లోందని తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. కాటేజీలు అందుబాటులోకి వస్తే ఎకో పార్కు ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకుటుందని చెప్పారు. ఎకో పార్కులో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందన్నారు. కాగా కాటేజీలతో పాటు నిర్మించిన స్విమ్మింగ్ పూల్, పార్కు, రెస్టారెంట్, డైనింగ్ హాలు ఇతర భవనాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఎఫ్‌ఓ జోజి, ఆర్‌డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, రేంజ్ అధికారి అరవింద్ తదితరులు ఉన్నారు.


