వరి కోతలొద్దు
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
వెల్ధుర్తి(తూప్రాన్): వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరి కోతలు ఆపాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గే వరకు తూకం వాయిదా వేయాలన్నారు. ధాన్యంను దళారులకు, ప్రైవేట్ వ్యాపారుల వద్దకు ఆశ్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కోనగోలు కేంద్రాల్లోనే విక్రయించేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా కొనగోలు కేంద్రాలలో తగు జాగ్రత్తలు చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో మాసాయిపేట తహసీల్ధార్ జ్ఞానజ్యోతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, ఏవో కవిత పాల్గొన్నారు.


