మెరుగైన బోధన అందించాలి
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాసి తమ సామర్థ్యం పరీక్షించుకోవాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. సోమవారం మండలంలోని చందంపేట ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎస్‌ఏ 1 పరీక్షతీరును పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను పరిశీలించేందుకు ఈ పరీక్షలు కీలకమన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతో పాటు వారి అభ్యసన ప్రతిభను ఎప్పకప్పుడు గ్రహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ నీటిశుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం సాయిరెడ్డి, ఉపాధ్యాయు లు శ్రీధర్, శివప్రసాద్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి
చేగుంట(తూప్రాన్): రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలని తూప్రాన్ ఆర్డీఓ జ యచంద్రారెడ్డి అన్నారు. సోమవారం చేగుంట ఎంపీడీఓ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాప్యం లేకుండా ధాన్యం సేకరించి అందుబా టులో ఉన్న లారీల్లో ధాన్యం తరలించాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్, వ్వయసాయ అధికారి హరిప్రసాద్, సహకార సంఘాల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
వెల్దుర్తి(తూప్రాన్): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిణి మాధవి సూచించారు. సోమవారం వెల్దుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రికార్డులు, పరిసరాలు, తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఫిబ్రవరిలో వార్షిక పరీక్షలు జరగనున్నందున విద్యార్థులందరూ ఇప్పటి నుంచే కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పాఠ్యాంశాలకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే అధ్యాపకుల వద్ద వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రోజూ ఉదయం, సాయంత్రం స్టడీ అవర్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు.
గురుకులంలో
మళ్లీ ఎలుకల కలకలం
నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి మరో ఇద్దరు వి ద్యార్థులను ఎలుకల కరిచాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఎలుకలను గది నుంచి బయటకు వెళ్లగొట్టారు. సోమవారం ఉదయం ఎలుకలు కరి చిన ఇద్దరు విద్యార్థినులను నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మూడు రోజుల క్రితం ఎనిమిది మంది విద్యార్థినులను ఎలకలు కరిచిన విషయం తెలిసిందే. కాగా ప్రిన్సిపాల్ లలితాదేవి, సిబ్బంది కలిసి ఎలుకలు గదుల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. చుట్టూ పంట పొలాలు ఉండటంతో ఎలుకలు సంచరిస్తున్నాయని తెలిపారు.
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని పెద్దాపూర్ గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంట చేతికందే దశలో వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతుంటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
మెరుగైన బోధన అందించాలి
మెరుగైన బోధన అందించాలి


