డీసీసీపై ఉత్కంఠ
14కు చేరిన ఆశావహుల సంఖ్య
జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నిక అంశం ఉత్కంఠ రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త నిబంధనలతో పాటు ఎంపిక విధానం తీరు మారింది. సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా, సామాజిక న్యాయం పాటిస్తూ.. సమర్థుడికి పట్టం కట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే తమ అనుచరులకు పీఠం కట్ట బెట్టుకోవాలనే తపనతో మెదక్, అందోల్, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
– మెదక్ అర్బన్
జిల్లాకు అందోల్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలతో సంబంధం ఉంది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ పెద్దలు డీసీసీ పదవిని తమ అనుచరులకు కట్టబెట్టుకోవాలనే ఆశతో ఉన్నారు. మెదక్‌కు చెందిన పెద్దాయన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన తన ప్రధాన అనుచరుడి పేరును ప్రతిపాదించారు. తన పరిధిలోని కార్యకర్తలు కూడా అతని పేరునే బలపరిచారు. పోటీ పెరగకుండా జాగ్రత్తలు సైతం తీసుకున్నారు. కాగా అదే నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి సైతం డీసీసీ పదవిని ఆశిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు జోగిపేట ప్రాంతానికి చెందిన అమాత్యుల మద్దతు ఉందనే ప్రచారం ఉంది. రామాయంపేట నుంచి మరో బీసీ నాయకుడు నామినేషన్ దాఖలు చేసినా, నామమాత్రంగా మిగిలిపోయింది. అయితే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఏఐసీసీ ప్రతినిధులు ఆరా తీశారు. సమర్థులైన నాయకులకు స్వయంగా ఫోన్లు చేసి నామినేషన్లు దాఖలు చేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో పాపన్నపేట నుంచి పబ్బతి ప్రభాకర్‌రెడ్డి, రామాయంపేట నుంచి సుప్రభాత్‌రావు, రమేశ్‌రెడ్డి, తూప్రాన్ నుంచి జింక మల్లేశం, నాగరాజు, బల్వంత్‌రెడ్డి, అజయ్, అమీద్, శ్రీకాంత్‌రెడ్డి, విశ్వరాజ్, రవి సైతం నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దీంతో ఆశావహుల సంఖ్య 14కు చేరింది. అయితే వీరి గురించి గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన సిద్దిపేట కాంగ్రెస్ అధి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలు స్తోంది.
అనుచరుల కోసం పావులు కదుపుతున్న పెద్దలు
ఈనెలాఖరుకు ఖరారయ్యే అవకాశం
ముగ్గురు నాయకులకు ప్రతిష్టాత్మకం
సమర్థుడికే సారథ్యం
ఏఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే అధిష్టానానికి జాబితా సమర్పించారు. వీరి కి వచ్చిన ర్యాంకింగ్‌తో పాటు, అభ్యర్థి సమర్థత ఆధారంగా డీసీసీ పద వి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అటు అభ్యర్థులు.. ఇటు వారిని ప్రతిపాదించిన నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.


