అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
● అదనపు కలెక్టర్ నగేశ్ ● ప్రజావాణికి 99 వినతులు
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణికి ప్రాధాన్యం ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. సో మ వారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. కాగా మూడు వారాల విరామం తర్వాత నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అదనపు కలెక్టర్ ఒక్కరే వినతులు స్వీకరించారు. దీంతో ఫిర్యాదుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మొత్తం 99 అర్జీలు వచ్చాయి. కాగా నర్సాపూర్‌లోని ఆయాశాఖల అధికారులు సమాచా ర హక్కు చట్టాన్ని గౌరవించడం లేదని, ఆయాశాఖల వివరాల కోసం ఎంఈఓ, మున్సిపల్ కమిషనర్‌కు 40 రోజుల క్రితం వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదని పలువురు ప్రజావాణిలో ఫిర్యా దు చేశారు. అయితే తమకు కమీషన్లు కాకుండా వేతనాలు ఇవ్వాలని ఇటీవల నూతనంగా విధుల్లో చేరిన సర్వేయర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 నెలల శిక్షణ సమయంలోనూ తమకు ఎలాంటి టీఏ, డీఏలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడైనా తమకు వేతనాలు ఇవ్వాలని కలెక్టరేట్‌లో నిరసన తెలిపి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.


