బాధ్యతగా విధులు నిర్వర్తించండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: క్రమశిక్షణతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. జిల్లాకు నూతనంగా ఏడుగురు ఎంపీడీఓలు వచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా వారికి సూచనలు, సలహాలు అందించారు. మండలాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. పారదర్శకపాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓలు శాలిక (తూప్రాన్), ప్రీతిరెడ్డి (నార్సింగి), వలుస శ్రేయంత్(హవేళిఘణాపూర్), బానోత్ ప్రవీణ్ (చిలప్‌చెడ్), వేద ప్రకాశ్‌రెడ్డి (అల్లాదుర్గ్)లు కలెక్టర్ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్నారు.
కొనుగోళ్లలో లోటుపాట్లు రావొద్దు
హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. సోమవారం మెదక్ మండలం రాయిన్‌పల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ వెంట ఐకేపీ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు.


