పాపన్నపేట(మెదక్): సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు సాగు నీరు వెంటనే విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమై సు మారు 53 రోజులు కావొస్తున్నా, ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన వర్షాలు కురువలేదన్నారు. దీంతో ఘనపురం ఆయకట్టు రైతాంగం వేసిన వరి తుకాలు ముదిరి పోతున్నాయని వివరించారు. సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు వాటాగా రావాల్సిన 4.06 టీఎంసీలపై ఇక్కడి రైతాంగానికి పూర్తి హక్కు ఉందన్నారు. ప్రస్తుతం సింగూరులో 18.6 టీఎంసీలకుపైగా నీరు ఉన్నందున, వెంటనే 0.5 టీంఎసీల నీటిని విడుదల చేయాలని కోరారు.
కుక్కల దాడిపై విచారణ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని రూప్ల తండాలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతిచెందిన విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం పీహెచ్‌సీ, పశువైవెద్య సిబ్బంది తండాలో విచారణ చేపట్టారు. ఐదేళ్ల లోపు పిల్లలు కుక్కల దాడిలో చనిపోతే చైల్డ్ డెత్ ఆడిటింగ్ నిర్వహించనట్లు పీహెచ్‌సీ వైద్యురాలు సాయిసౌమ్య చెప్పారు. తండావాసులతో మాట్లాడి దాడి వివరాలను నమోదు చేసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు, తండావాసులు కోరారు.
ఐటీఐలో ప్రవేశాలు
మెదక్ కలెక్టరేట్: మెదక్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఎలక్ట్రీషియన్ (8), ఫిట్టర్ (6), డ్రాఫ్ట్‌మెన్ సివిల్ (12), మెకానిక్ డీజిల్ (12), కోఫా (33) సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. విద్యార్థినులకు 33 శాతం రిజర్వేషన్ అందిస్తున్నట్లు వివరించారు.
మహిళల సంక్షేమమే లక్ష్యం
సంగారెడ్డిటౌన్: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల అన్నారు. బుధవారం సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. అనంతరం మహిళలను సత్కరించి, వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం విజయ్‌కుమార్, డిపో మేనేజర్ ఉపేందర్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేతకీ హుండీ ఆదాయం.. రూ. 29,79,750
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయ హుండీని బుధవారం రాజరాజేశ్వర సేవా సమి తి సభ్యులు లెక్కించారు. వివిధ ప్రాంతాల భక్తులు నగదు రూపంలో సమర్పించిన ఆదాయాన్ని లెక్కించగా రూ. 29,79,750 వచ్చిన ట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఈఓ శివరుద్రప్ప, పర్యవేక్షకుడు శశిధర్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

సింగూరు నీటిని విడుదల చేయండి

సింగూరు నీటిని విడుదల చేయండి