
అర్హులందరికీ రేషన్‌కార్డులు
పెద్దశంకరంపేట(మెదక్)/హవేళిఘణాపూర్/మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి రేషన్‌కార్డు అందజేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలో లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 9,960 నూతన రేషన్‌కార్డులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని, మార్పులు, చేర్పులకు ప్రభు త్వం అవకాశం కల్పించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చి న తర్వాత ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారని, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే హవేళిఘణాపూర్ మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలు, మందులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు కూచన్‌పల్లి రైతు వేదికలో భూసార పరీక్షలు ఫలితాల ద్వారా రసాయన ఎరువులు వినియోగిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతికి కృషి
మెదక్ మున్సిపాలిటీ: మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మహాలక్ష్మి పథకంపై బుధవారం మెదక్ ఆర్టీసీ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2.72 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం వల్ల రూ. 81.04 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. జిల్లా పరిధిలో కొత్తగా 8 బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అనంతరం వ్యాస రచన పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్