హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు
రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులు వీరే..
మెదక్‌జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ ఎంపిక పోటీలను జిల్లా కేంద్రంలోని సాయి స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రస్థాయి పుట్‌బాల్ జట్టుకు 18 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఫుట్‌బాల్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాకారుల ఎంపిక పోటీలలో ఉమ్మడి జిల్లా నుంచి 95 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు నిజామాబాద్‌లో ఈనెల 27 నుంచి జూలై 1వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి నగేష్, సత్యనారాయణ, మెదక్ ఫుట్‌బాల్ అకాడమి కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు.


