డీఈఓ రాధాకిషన్
కార్పొరేట్‌కు దీటుగా బోధన
నిజాంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామా ల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. చల్మెడలో సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ యాదగిరి, మాజీ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రమే ష్, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, హెచ్‌ఎం సతీష్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


