
ముందస్తుగానే రుతుపవనాలు
ఈసారి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ద్రోణి వల్ల ఈ వర్షాలు కురుస్తున్నట్లు అంచనా. దీనికి తోడు రావాల్సిన నైరుతి ముందే కూసింది. సహజంగా జూన్ మొదటి వారంలో వచ్చే నైరుతి ఈసారి మే మధ్యస్తంలోనే పలకరించింది. జూన్ 24నాటికే కేరళను రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇలాంటి అకాల వర్షాల కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే సాధారణం కంటే ముందుగా వర్షాకాలం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ముందుగా వర్షాలు పడి సరైన సమయంలో వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వానాకాలం సాగు చేసేవారు వాతావరణ మార్పులు ఎలా ఉన్నా వారి జాగ్రత్తల్లో వారు ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని బాగాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి.