
24న కన్వెన్షన్ సెంటర్ లీజు వేలం
రామాయంపేట(మెదక్): మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ (ఫంక్షన్ హాలు) లీజు ఇవ్వడానికి ఈనెల 24న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్ పేర్కొన్నారు. నెలవారీ అద్దె ప్రతిపాదికన వేలం నిర్వహిస్తామని, ఇందులో పాల్గొనేవారు ముందస్తుగా రూ.3వేలు దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించే వేలం పాటలో పాల్గొనే వారు ఈనెల 21 నుంచి 23 లోపు రూ. 60 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. వేలంలో పాల్గొనే వారు పంచాయతీకి ఎలాంటి బాకీ ఉండరాదని, నెగ్గినవారు వారం రోజుల్లో ఆరు నెలల అద్దె ముందస్తుగా చెల్లించాలని కార్యదర్శి పేర్కొన్నారు. వివరాలకు 99513 37591 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చాకరిమెట్ల
ఆలయం వద్ద వేలం
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజ సామగ్రి అమ్మకాల కోసం మంగళవారం వేలంపాట నిర్వహించారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఈఓ శ్రీనివాస్ సమక్షంలో వేలం పాట నిర్వహించగా ఐదుగురు పాల్గొని.. 10 లక్షల 50 వేల వరకు పాడారు. గత ఏడాది 12 లక్షల 60 వేల వరకు వేలం ద్వారా ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు. సరైన ధర రాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 27న బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ, సిబ్బంది రామకృష్ణ, వెంకట్‌రెడ్డి, గ్రామస్తులు నర్సింగరావు, నరేందర్, వెంకటేష్, దశరఽఽథ్, పాపయ్యచారి, వీరాస్వామి, హరిసింగ్, శంకర్‌గౌడ్, మహేష్
తదితరులు ఉన్నారు.
ఎరువుల దుకాణం తనిఖీ
రామాయంపేట(మెదక్): డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యాపారం నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్‌నారాయణ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కొందరు విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లైసెన్సు ఉన్న వ్యాపారులవద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, వెంటనే రసీదు తీసుకోవాలన్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో డీలర్లు ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
వెనువెంటనే అన్‌లోడింగ్..
శివ్వంపేట(నర్సాపూర్): కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్స్‌కు వస్తున్న ధాన్యాన్ని వెనువెంటనే అన్‌లోడింగ్ చేయాలని డీసీఎస్‌ఓ సురేష్‌రెడ్డి, డీఎం జగదీశ్‌కుమార్ అన్నారు. మండలంలోని దొంతిలోని కామాక్షి రైస్‌మిల్‌కు ఇతర మండలాల నుంచి 30 లారీల ధాన్యం రావడంతో ఇబ్బందులు తలెత్తడంతో ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్‌ఐ కిషన్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీసీఎస్‌ఓ సురేష్‌రెడ్డి, డీఎం జగదీశ్‌కుమార్ దొంతి రైస్‌మిల్‌ను మంగళవారం పరిశీలించారు. ధాన్యం వెంటనే అన్‌లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

24న కన్వెన్షన్ సెంటర్ లీజు వేలం

24న కన్వెన్షన్ సెంటర్ లీజు వేలం