
బోధనలో మెలకువలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయులు శిక్షణ సమయంలో బోధనలో మెలకువలు నేర్చుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ఫర్ ప్రైమరీ టీచర్స్‌కు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెదక్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎడ్యుకేషనల్ సెక్రటరీ అధికారి జూమ్ మీటింగ్‌లో పలు సూచనలు చేశారు. జిల్లా విద్యాధికారి రాధా కిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్, ఆర్పీలు, మండలంలోని ఎల్‌ఎఫ్‌ఎల హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.
డీఈఓ రాధాకిషన్