
లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగొద్దు
హౌసింగ్ పీడీ మాణిక్యం
మెదక్‌జోన్: ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బిల్లులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్(ఓటీఎస్) ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులు ఎంపిక చేసిన ఏఈలు జిల్లాకు 11 మందిని కేటాయించారు. మంగళవారం వారితో ఆయన సమావేశం నిర్వహించి పలు మండలాలను కేటాయించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగించడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లించేలా ఎంబీ రికార్డులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ యాదగిరి పాల్గొన్నారు.