
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని జిల్లా సంస్థ గత ఎన్నికల ఇన్‌చార్జి వరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలంలోని గ్రామశాఖ అధ్యక్షుల ఎన్నికల కోసం చేపట్టిన నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో మతతత్వాన్ని ముందుకు తీసుకువచ్చి అధికారం దక్కించుకోవాలనే నైజం బీజేపీదని, ప్రాంతీయ వాదం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టే మరో పార్టీ బీఆర్‌ఎస్ అని ఆరోపించారు. అంతకుముందు స్థానిక బస్టాండ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకు సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వరప్రసాద్‌తోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి నాయకుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. కాగా కౌడిపల్లి మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి వరప్రసాద్‌తోపాటు టీపీసీసీ కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి తదితరులు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, మాజీ ఎంపీపీ మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, నాయకులు శేషసాయి రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, సావిత్రి రెడ్డి, కౌడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ధన్‌సింగ్, నాయ
కుడు క్రిష్ణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, వెస్‌చైర్మన్ చిన్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ సంస్థాగత
ఎన్నికల ఇన్‌చార్జి వరప్రసాద్