
పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
మెదక్ మున్సిపాలిటీ: పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీస్ సిబ్బందికి సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పెండింగ్ కేసులపై పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సమస్యలతో స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. గ్రామాల్లో సీసీటీవీల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్‌రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్, ఎఆర్ డీఎస్పీ రంగానాయక్,టౌన్ సీఐ నాగరాజు, సీఐ రేణుక, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి