వన దుర్గమ్మకు పల్లకీ సేవ | - | Sakshi
Sakshi News home page

వన దుర్గమ్మకు పల్లకీ సేవ

May 13 2025 7:59 AM | Updated on May 13 2025 7:59 AM

వన దు

వన దుర్గమ్మకు పల్లకీ సేవ

పాపన్నపేట(మెదక్‌): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయల వన దు ర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దుర్గమ్మకు జై అంటూ పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోకుల్‌షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది.

ఆ ఘనత మోడీదే..

కౌడిపల్లి(నర్సాపూర్‌): పాక్‌ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ అన్నారు. సోమవారం కౌడిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఉగ్ర శిబిరాలతో పాటు పాకిస్తాన్‌లోని పలు ఆర్మీ రక్షణ వ్యవస్థలను మన దేశ త్రివిధ దళాలు ధ్వంసం చేశాయని కొనియాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లో ఉగ్ర మూకలను తుదముట్టించి ప్రతీకారం తీర్చుకుందన్నారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే కశ్మీర్‌ సమస్య తలెత్తిందని విమర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాకేష్‌, నాయకులు శంకర్‌, నగేష్‌ గౌడ్‌, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా

ప్రమోట్‌ చేయండి

మెదక్‌ కలెక్టరేట్‌: తమను ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా ప్రమోట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మేట్లు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మేట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 493 గ్రామాల్లో సుమారుగా 200 గ్రామాల్లో మాత్రమే ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిలో ఉన్నట్లు తెలిపారు. మిగితా 293 గ్రామాల్లో సీనియర్‌ మేట్లతో ఉపాధి హామీ పథకం నడుస్తుందన్నారు. పనిభారం పెరుగుతున్నందున సీనియర్‌ మేట్లను ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ప్రమోట్‌ చేయాలని కోరారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయ కులు దుర్గేష్‌, యాదగిరి, రోహిత్‌, నాగమణి, శ్రీకాంత్‌, మహేష్‌, నరేష్‌, రవి, గోపాల్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లు త్వరగా

పూర్తి చేయాలి

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి, రైస్‌ మిల్లులకు పంపించాలని నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌ ఆదేశించారు. సోమవారం మండల పరిధిలోని శీలాంపల్లిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి మాట్లాడారు. నిర్వాహకులు త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టి, తూకం అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలించాలన్నారు. లారీల కొరత, లేబర్‌ తదితర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు సజావుగా జరపాలన్నారు. వారం రోజుల్లో వందశాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

వన దుర్గమ్మకు పల్లకీ సేవ 
1
1/3

వన దుర్గమ్మకు పల్లకీ సేవ

వన దుర్గమ్మకు పల్లకీ సేవ 
2
2/3

వన దుర్గమ్మకు పల్లకీ సేవ

వన దుర్గమ్మకు పల్లకీ సేవ 
3
3/3

వన దుర్గమ్మకు పల్లకీ సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement