
సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 74 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అత్యధికంగా భూ సమస్యలపై 23, ఇందిరమ్మ ఇళ్ల కోసం 9, పెన్షన్లు, ఇతర సమస్యలపై 37, ఉద్యోగ ఉపాధి కోసం 1 చొప్పున ఉన్నాయి. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో త్వరగా విచారణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా వ్యవసాయ పొలాల్లోకి వెళ్లే దారిని కొందరు కబ్జా చేశారని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అక్కన్నపేట గ్రామ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
భవిత కేంద్రం సందర్శన
మెదక్‌జోన్: దివ్యాంగ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం భవిత కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. సోమవారం పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన అమరవీరుల స్థూపం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం సోమవారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో స్థలాన్ని పరిశీలించారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలో 16 గ్రా మాల్లో సోమవారంతో 13 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని, వచ్చిన దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని గౌతాపూర్, సోమక్కపేట్‌లో రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం గౌతాపూర్‌లో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తలెత్తడంతో పరిష్కరించాలని, వనరులు లేకపోతే ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
ప్రజావాణికి 74 వినతులు