
విద్యుత్ షాక్‌తో పాడిగేదె మృతి
వెల్దుర్తి(తూప్రాన్): మేతకు వెళ్లిన పాడిగేదె ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని ఉప్పులింగాపూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుత్తి ప్రభాకర్ వ్యవసాయంతో పాటు పాడి గేదెల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే శనివారం గేదెలను మేతకు తీసుకెళ్లగా గ్రామ శివారులోని ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్త్ తీగలకు విద్యుత్ సరఫరా కావడంతో పాడి గేదె మృత్యువాత పడింది. విద్యుత్ అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.