సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

May 11 2025 12:38 PM | Updated on May 11 2025 12:40 PM

నర్సాపూర్‌: సీఎం రిలీఫ్‌ పథకంతో పేదలకు ఆర్థిక సహాయం అందుతుందని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. శనవారం తన నివాసంలో నర్సాపూర్‌, కౌడిపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. పథకం నుంచి పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, ఎల్లం తదితరులు ఉన్నారు.

వీర జవాన్‌

మురళీనాయక్‌కు నివాళులు

చిన్నశంకరంపేట(మెదక్‌): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్‌ మురళి నాయక్‌కు నార్సింగి మండలం నర్సంపల్లి పెద్దతండా గిరిజన నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం నార్సింగి మండల కేంద్రంలో నర్సంపల్లి పెద్ద తండా గిరిజన నాయకులు జాతీయ జెండానే చేతపట్టుకుని నివాళిగా ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడికి జోహర్లు అంటు నినాదించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ బిక్యానాయక్‌, మాజీ సర్పంచ్‌ ఛత్రియానాయక్‌, బాషానాయక్‌, శంకర్‌నాయక్‌ పాల్గోన్నారు.

శ్రీ రేణుక ఎల్లమ్మదేవి పంచమ వార్షికోత్సవం

కొల్చారం(నర్సాపూర్‌): మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారికి గంగ బోనం ఊరేగించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఒగ్గు కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పద్మశాలీల బండ్ల ఊరేగింపు

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని రంగంపేటలో కొలువైన శ్రీ రంగనాయక స్వామి పంచాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతూ వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున స్వామివారిని అశ్వ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం గ్రామ పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో ఆనవాయితీ ప్రకారం స్వామివారికి బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు.

అమ్మవారికి ఒడిబియ్యం

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీకన్యకా పరమేశ్వరీ మాతకు శనివారం మహిళలు ఒడిబియ్యం సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయంలో శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కాగా శనివారం మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి అమ్మ వారికి ఒడిబియ్యం సమర్పించి సహస్ర పారాయణం చేశారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత 
1
1/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత 
2
2/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత 
3
3/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత 
4
4/4

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement