నిబంధనల మేరకే పరిహారం
నర్సాపూర్: సంగారెడ్డి కాలువ రీచ్– 2 కోసం ప్రభుత్వం తీసుకుంటున్న భూములకు చట్ట పరిధిలో పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. గురువారం స్థానిక రైతు వేదికలో మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులతో అవార్డు సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. భూముల విస్తీర్ణం, ఆయా భూములలో చెట్లు, వ్యవసాయ బోర్లు ఇతర ఆస్తులు ఉంటే వాటి వివరాలు నమోదు చేయించి, వాటి విలువ మేరకు భూముల పరిహారంతో కలిపి అందజేస్తామని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమతో చెప్పాలని రైతులకు సూచించారు. భూమికి భూమి పరిహారం కింద ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. కాగా రైతుల అభిప్రాయాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు పంపుతామని ఆర్డీఓ చెప్పారు. శుక్రవారం శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ ఫైజల్, సాగునీటి పారుదల శాఖ(కెనాల్) డీఈ కవిత, ఏఈఈ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓ మహిపాల్


