
సృజనాత్మకత అవసరం
చిన్నప్పటి నుంచే
మనోహరాబాద్(తూప్రాన్): చిన్నప్పటి నుంచే సృజనాత్మకతతో కూడిన విద్యాబోధన అవసరమని, అది అంగన్‌వాడీలతోనే సాధ్యమవుతుందని సీ్త్ర,శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నర్సాపూర్ సీడీపీఓ ఆధ్వర్యంలో మంగళవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో ఐసీడీఎస్ అధికారులు ఏర్పాటు చేసిన చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మీ పిల్లలను అంగన్‌వాడీలలో చేర్పించాలని, కార్పొరేట్‌కు దీటుగా తమ ప్రభుత్వం అంగన్‌వాడీల ద్వారా చదువు చెప్పించడానికి కృషి చేస్తుందని చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లలో జాయిన్ చేసి దుబారా ఖర్చు చేసుకోవద్దని, అంగన్‌వాడీలలో చేర్పించి ఆదా చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలలో 57 రకాల ఆట వస్తువులను, గర్భిణిల కోసం బెంచీలు, అవసరమైన పోషకాహారాన్ని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. చిన్నారులకు సైతం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించిన ఐసీడీఎస్ అధికారులు, సహకరించిన టెక్నిప్ ఎఫ్‌ఎంసీ ఇండియా సంస్థను అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందిని ఆమె అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఇన్‌చార్జి అడిషనల్ కలెక్టర్, డీఆర్వో భుజంగరావు, జేడీ విశాలాక్షి, డీడబ్ల్యూఓ హైమావతి, గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, నర్సాపూర్ సీడీపీఓ హేమాభార్గవి, జిల్లా సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
అది అంగన్‌వాడీలతోనే సాధ్యం:
మంత్రి సీతక్క
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే
అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు
ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాళ్లు, చార్టర్లను మంత్రి సీతక్క పరిశీలించారు. అనంతరం టెక్నిప్ ఎఫ్‌ఎంసీ ఇండియా సంస్థ స్పాన్సర్‌తో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను, మెమోంటోలను అందజేశారు.

సృజనాత్మకత అవసరం