
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
పాదచారి..
నడిచే దారేది?
మెదక్‌జోన్: మున్సిపాలిటీల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. చిరు వ్యాపారుల నుంచి మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. వస్తువులు, సామగ్రిని అడ్డుగా పెట్టడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్‌తో పాటు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేసినా పట్టించుకోవడం లేదు.
90 శాతం మేర ఆక్రమణ
జిల్లాలోని మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన ఫుట్‌పాత్‌లు 90 శాతం మేర ఆక్రమణకు గురయ్యాయి. చిరు వ్యాపారులతో పాటు బడా వ్యాపారుల వరకు ఫుట్‌పాత్‌పై దర్జాగా సామగ్రి పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రధానంగా మెదక్ జిల్లా కేంద్రంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పట్టణం మధ్య నుంచి ప్రధాన రహదారి ఉంది. 100 ఫీట్ల రోడ్డు కావటంతో మధ్యలో డివైడర్‌ను నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్‌ఫాత్‌ను నిర్మించారు. కానీ ఆక్రమణదారులు దానిని యథేచ్చగా కబ్జా చేశారు. జిల్లా నలుమూలల నుంచి పట్టణానికి నిత్యం వేలాది మంది వివిధ పనులపై వస్తుంటారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికావటంతో రోడ్లపై నడిచి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఫుట్‌పాత్‌లను వెంటనే ఖాళీ చేయాలని మెదక్ మున్సిపల్ సిబ్బంది 120 మందికి నోటీసులు జారీ చేశారు. అయితే ఆక్రమణదారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు. అలాగే కొన్ని వార్డుల్లో డ్రైనేజీలపై ఏకంగా పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో సైతం ఫుట్‌పాత్‌ను ఆక్రమించగా, ఇటీవల మున్సిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో వాటిలో కొన్నింటిని బలవంతంగా తొలగించారు. దీంతో రెచ్చిపోయిన ఆక్రమణదారులు మళ్లీ యథావిధిగా ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు.
ఎవ్వరిని ఊపేక్షించం
కొంతమంది చిరు వ్యాపారులతో పాటు బడా వ్యాపారస్తులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. అలాంటి వారికి కొంత గడువు ఇస్తూ నోటీసులు జారీ చేశాం. గడువులోగా తొలగించకుంటే ఎవ్వరిని ఊపేక్షించం. నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించిన వాటిని తొలగించి తీరుతాం.
– శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్
అధికార పార్టీ నేతల మద్దతు
మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న ఆక్రమణదారులకు అధికార పార్టీ నేతలు వత్తాసు పలుకుతున్నారు. ఫలానా వ్యక్తి మన వాడు, అతడు ఫుట్‌పాత్‌పై ఏర్పాటుచేసుకున్న డబ్బాను ముట్టుకోవద్దని మున్సిపల్ సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోతున్నారని, మేం ఏం చేయలేకపోతున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పకనే చెబుతున్నారు.
న్యూస్‌రీల్
మున్సిపాలిటీల్లో
కానరాని ఫుట్‌పాత్‌లు
రోడ్లపై నడుస్తున్న పాదచారులు
తరచూ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌జామ్
నోటీసులు ఇచ్చినా
స్పందించని ఆక్రమణదారులు

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025