ప్రశాంతంగా ‘నీట్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘నీట్‌’

May 5 2025 9:02 AM | Updated on May 9 2025 5:04 PM

మెదక్‌జోన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను నిశితంగా తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించారు. నిమిషం నిబంధన ఉండటంతో ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. కాగా 487 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 470 మంది హాజరయ్యారు. ఈలెక్కన 17 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ సందర్శించి ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. పోలీసులు 144 సెక్షన్‌ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉపాధ్యాయుడికి సన్మానం

నర్సాపూర్‌రూరల్‌: యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విద్యాబోధనను వినూత్న రీతిలో చాటిచెప్పిన మండలంలోని మహ్మదాబాద్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిరాజును రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అభినందించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. రవి రాజ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రపంచ దేశాలలో మన విద్యా విధానాన్ని మెచ్చుకునే విధంగా తయారు చేశాడు. ఈసందర్భంగా డీఈఓ రాధాకిషన్‌, మండల విద్యాధికారి తారాసింగ్‌ మండలంలోని ఉపాధ్యాయులు అభినందించారు.

ఒకే రోజు రెండు పరీక్షలు!

పాపన్నపేట(మెదక్‌): ఈనెల 25వ తేదీన ఒకే రోజు రెండు పరీక్షలు విద్యార్థులకు విషమ పరీక్షగా మారింది. ఇంటర్‌ సప్లిమెంటరీ, డీఈఈ సెట్‌ ఒకే రోజు నిర్వహించనున్నారు. ఇంటర్‌ మీడియెట్‌కు సంబంధించి ఆరోజు గణితం, జువాలజీ, చరిత్ర సప్లిమెంటరీ పరీక్షలు ఉ న్నాయి. అదే రోజు ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు డీఈఈ సెట్‌ రాయనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం చేయాలనుకున్న వారు డీఈడీ చేస్తున్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన వారు, సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్‌ అయితేనే సెట్‌ పొందే అవకాశం ఉంటుంది. కావున రెండు పరీక్షల్లో ఏదైనా ఒకటి వాయిదా వేయాలని కోరుతున్నారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలిగా బాలమణి

రామాయంపేట(మెదక్‌): సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలిగా రామాయంపేటకు చెందిన బాలమణి, జిల్లా కార్య దర్శిగా మల్లేశం ఎన్నికయ్యారు. ఈమేరకు ఆదివారం రాత్రి జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ఇతర ప్రతినిధుల సమక్షంలో నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా బస్వరాజ్‌, మహేందర్‌, నాగరాజు, అన్నపూర్ణ, సహాయ కార్యదర్శులుగా నాగేందర్‌రెడ్డి, ఆసిఫ్‌, శారద, సంతోష్‌, కోశాధికారిగా నర్సమ్మను ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 16 మందిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

దరువు అంజన్నకు, బుర్ర సతీష్‌కు గద్దర్‌ అవార్డులు

దుబ్బాకటౌన్‌/బెజ్జంకి(సిద్దిపేట): ఉద్యమ కారులు, గాయకులకు గద్దర్‌ అవార్డులు వరించాయి. సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని భాస్కర ఆడిటోరియంలో గద్దర్‌ ఐకాన్‌– 2024 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయపోల్‌ మండలం కేంద్రానికి చెందిన కళాకారుడు దరువు అంజన్న, బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన బుర్ర సతీష్‌కు చేసిన సేవలకు గుర్తుగా అవార్డులు దక్కాయి. అవార్డులను శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అందించారు.

ప్రశాంతంగా ‘నీట్‌’ 1
1/3

ప్రశాంతంగా ‘నీట్‌’

ప్రశాంతంగా ‘నీట్‌’ 2
2/3

ప్రశాంతంగా ‘నీట్‌’

ప్రశాంతంగా ‘నీట్‌’ 3
3/3

ప్రశాంతంగా ‘నీట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement