కాంగ్రెస్ పతనం ప్రారంభం
చిన్నశంకరంపేట(మెదక్): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం కాబోతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభ సన్నాహ క సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాధనే ఏకై క ఎజెండాగా ఏర్పడిన గులాబీ పార్టీ 25 ఏళ్లుగా ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన ప్రజలకు మేలు చేసిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనతోనే ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు రాజు, లక్ష్మారెడ్డి, సుజాత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
మెదక్‌జోన్: జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఇద్దరు బాలురు ఎంపికై నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 14వ తేదీ నుంచి 16వ వరకు వనపర్తిలో జరిగిన అండర్– 14 బాలుర రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో మెదక్ జిల్లా నుంచి పాల్గొన్న హసన్, శరత్‌చంద్ర మంచి ప్రతిభ కనబరిచారు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొననున్నారు. జట్టులో మొత్తం 18 మంది క్రీడాకారులు ఉండగా, జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులకు చోటు దక్కడం గర్వకారణం అన్నారు. కాగా శరత్‌చంద్రది రామాయంపేట పట్టణం కాగా, హసన్ మెదక్ పట్టణానికి చెందిన బాలుడు.
సన్నబియ్యం
నిరుపేదలకు వరం
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం నిరుపేదలకు వరంలాంటిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆరెగూడెంలో లబ్ధిదారుడు కౌడె సత్తయ్య ఇంట్లో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, సామాన్య ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. ప్రభుత్వంపై భారం పడుతున్నా పేదలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, శేఖర్, సుధాకర్‌గౌడ్, మల్లేశం, నర్సింహారెడ్డి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్‌స్కిల్స్, ఏఐపై శిక్షణ
మెదక్ కలెక్టరేట్: సాఫ్ట్ స్కిల్స్, ఏఐపై మెదక్ డిగ్రీ కళాశాలలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన లేదా తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల కోసం ఈ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో శిక్షణ నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువత దీనికి అర్హులని, శిక్షణ పూర్తయిన తర్వాత వార్షికంగా రూ. 2 నుంచి 3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్ పతనం ప్రారంభం
కాంగ్రెస్ పతనం ప్రారంభం


