టూరిస్టులపై ఉగ్రదాడి అమానుషం
మెదక్‌జోన్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ప ర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. గురువారం టీఎన్జీఓ భవన్‌లో అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో మతాల మధ్య ఐక్య తను చెదరగొట్టి మత చిచ్చు పెట్టాలన్నదే ఉగ్రవాదుల అభిమతమన్నారు. తమ దేశంలోని కాశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి పహల్గాం అమరులకు జోహార్ అంటూ నినదించారు. కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా సహా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాష, ఉపాధ్యక్షులు ఫజులుద్దీన్, కోటి రఘునాథరావు, సంయుక్త కార్యదర్శి శివాజీ తదితరులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
రామాయంపేట(మెదక్): ఉగ్రదాడికి నిరసనగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రామాయంపేటలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్య నా రాయణ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించారు. వీహెచ్‌పీ ప్రతినిధులతో పాటు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


