ఎంపీ రఘునందన్ వినతి
నర్సాపూర్: ప్యారానగర్‌డంప్‌యార్డుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ సుశీల్‌కుమార్ అవస్తిని కలిసి వినతిపత్రం అందచేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల మండలం ప్యారానగర్‌లో నిర్మిస్తున్న డంప్‌యార్డు అనుమతులను రద్దు చేయాలని ఎంపీ కోరారు. డంప్‌యార్డుకు సంబంధించిన పలు అంశాలను రఘునందన్ వివరించారు. ఎంపీ వెంట నర్సాపూర్ జేఏసీ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్, గుమ్మడిదల్ల మండలానికి చెందిన జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
జమిలి ఎన్నికలతో
అనేక లాభాలు
ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌గౌడ్
నర్సాపూర్: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో అనేక లాభాలు ఉంటాయని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌గౌడ్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విధానంతో డబ్బుతో పాటు సమయం కలిసొస్తుందని చెప్పారు. ఎన్నికలు రాగానే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతుందని, ఒకేసారి ఎన్నికలు జరిగితే కోడ్ ఒకేసారి ఉంటుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. దేశం బాగు కోసం అందరూ కలిసి రావాలన్నారు. ఆయన వెంట బీజేపీ నాయకులు సురేష్, శంకర్, కరుణాకర్, చంద్రయ్య, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.
నైపుణ్యాన్ని
పెంపొందించుకోవాలి
నర్సాపూర్: సర్టిఫికేషన్ కోర్సులతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫార్మాసిస్టులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సాపూర్‌లోని వైపర్ కాలేజీలో మంగళవారం ప్రారంభమైన రిజిస్టర్డ్ ఫార్మాసిస్టులకు నైపుణ్యాభివృధ్ది శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచే శిక్షణ కార్యక్రమాలు ఫార్మాసిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. శిక్షణ శిబిరం నాల్గు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామాంజనేయులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాలు
సాధించాలి
డీఈఓ రాధాకిషన్
చిన్నశంకరంపేట(మెదక్): పదవ తరగతి విద్యా ర్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రాధాకిషన్ కోరారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం సూరారం జెడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాగ్రతతో ప్రశాంతగా పరీక్షలను రాయాలని కోరారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకూడదన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలి తాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ నీరజపవన్‌గౌడ్, నాగరాజు, గ్రామ నాయకులు మల్లారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి ఉన్నారు.
ప్యారానగర్ డంప్‌యార్డు అనుమతులు రద్దు చేయాలి
ప్యారానగర్ డంప్‌యార్డు అనుమతులు రద్దు చేయాలి
ప్యారానగర్ డంప్‌యార్డు అనుమతులు రద్దు చేయాలి