తొలిరోజు 96.41 % హాజరు | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు 96.41 % హాజరు

Mar 6 2025 6:53 AM | Updated on Mar 6 2025 6:53 AM

ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

మెదక్‌జోన్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు జిల్లావ్యాప్తంగా 6,410 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 6,180 మంది హాజరయ్యారు. 230 మంది గైర్హాజరు కాగా, 96.41 హాజరు శాతం నమోదైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు 144 సెక్షన్‌ విధించి కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించారు. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించారు.

మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వొద్దు

ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్‌ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని బాలుర జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పో లీస్‌ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఇంటర్‌ అధికారిణి మాధవి, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement